రెపరెప లాడిన మువ్వన్నెల జెండా

బతుకమ్మ మోర్తాడ్ : భారతదేశం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామ గ్రామాన వీధి వీధిన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. చిన్న, పెద్ద కుల మత బేదము లేకుండా ప్రతి ఒక్కరు జెండాలు ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

A fluttering three-moon flag మోర్తాడ్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం, పోలీస్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలు, మండలంలోని శెట్ పల్లీ, ధర్మోరా దొంకల్, పాలెం, తిమ్మాపూర్, గాం డ్లపేట్, దోన్ పాల్, సుంకేట్, వడ్యాట్ గ్రామాల్లోని యువజన సంఘాలు, యూనియన్ నాయకులు, ప్రభుత్వ పాఠశాలు, మహిళ సంఘాలు, అంగన్వాడి కేంద్రాలు జెండాలు ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించి అమరుల త్యా గాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మోర్తాడ్ ఎమ్మార్వో సత్యనారాయణ, డిప్యూటీ ఎమ్మార్వో సుజాత ఆర్.ఐ పథని లింగం, ఇంజనీర్ బి.నరేష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, రాజ్ కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

A fluttering three-moon flag

Leave A Reply

Your email address will not be published.