అనారోగ్యంతో మరణించిన పోలీస్ జాగిలంకి ఘనంగా అంతిమ వీడ్కోలు*

 

*జిల్లా పోలీస్ శాఖకు పోలీస్ జాగీలం పింకీ (ట్రాకర్) అందించిన సేవలు మరువలేనివి*

నేర పరిశోధనలో సాటి లేని జాగిలం,వాసన పసిగట్టిందంటే వదిలి పెట్టని నైజం అనేక కీలక కేసులలో నేరస్థులను డిటెక్ట్ చేసి పోలీస్ శాఖకు వెన్ను దన్నుగా నిలిచి దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు విధి నిర్వహణలో విశేష సేవలు అందించి అనారోగ్య కారణంగా ఈ రోజు మరణించడం చాలా బాధాకరం అని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు అన్నారు.

జిల్లా పోలీస్ శాఖలో డాగ్ స్క్వాడ్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ జాగిలం పింకీ అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు తుది శ్వాస విడిచింది.
2014 సంవత్సరంలో ఐఐటీ మొయినాబాద్ లో 9 నెలల పాటు డాగ్ హ్యాండ్లర్ నాగరాజు తో పాటు శిక్షణ పొంది శిక్షణా కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది.

పింకీ సాధించిన ఘనతలు:

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విధినిర్వహణలో భాగంగా నల్లగొండ 1 టౌన్ పరిదిలో బొట్టుగూడలో ఒక వ్యక్తిని ముక్కలు ముక్కలుగా చేసి పలు చౌరస్తాలలో తల మొండెం వేరు చేసిన సంచలన హత్య కేసులో కీలకమైన పాత్ర పోషించింది.నల్లగొండ జిల్లా కేంద్రం లో జూలకంటి ఇంద్ర రెడ్డి ఫంక్షన్ హల్ వద్ద జరిగిన 1కోటి 40 లక్షల రూపాయల చోరీ కేసులో గంటల వ్యవధిలో నిందితుల జాడలను తెలిపింది.గుండాల మండలం లోని వంగాల గ్రామం లో ఒక వ్యక్తిని చంపి బావిలో పడవేసిన వారం రోజుల తరువాత విషయం తెలుసుకున్న తరువాత ఈ డాగ్ తో అన్వేషణ చేస్తే నిందితుల ఇండ్ల లోకి వెళ్లి పసిగట్టింది.ఇలా పింకీ విధినిర్వహణలో చేసిన సేవలు మరువలేనివి.

విధి నిర్వహణలో అనేక సేవలు అందించిన పింకీ జాగీలం భౌతిక కాయానికి జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు అడిషనల్ ఎస్పి రమేష్ గారు పూలమాల వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించి అధికార లాంఛనాల తో అంత్య క్రియలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డిఎస్పి శ్రీనివాసులు, ఆర్ఐ సంతోష్, ఆర్.యస్.ఐ రాజీవ్,డాగ్ హ్యాండ్లర్ నాగరాజు డాగ్ స్క్వాడ్ సిబ్బంది కరుణాకర్,సంపత్,సతీష్, గోపాల్, మహేంద్ర,నరేష్,ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.