అక్షర కలం/ ఖమ్మం ప్రతినిధి:
ఖమ్మం : అంగరంగ వైభవంగా గంగమ్మ తల్లి జాతరను ఆదివారం ముదిరాజ్ కులస్తులు సుమారుగా 200 మందితో డిజె సౌండ్ , మేళతలలతో , చిన్నా , పెద్ద , అనే తారతమ్యం లేకుండా నృత్యాలు చేసుకుంటూ ప్రకాష్ నగర్ బ్రిడ్జి ప్రాంతంలో ఉన్న గంగమ్మ తల్లి కి బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు . గత 4 సం నుండి పోరాడుతున్న ప్రకాష్ ముదిరాజ్ మహిళా మత్స పారిశ్రామిక సంఘం లి॥ ప్రకాష్ నగర్ 28 & 29 డివిజన్లు, ఖమ్మం, (రి.నెం N-283) సభ్యత్వాలు రావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేసుకుంటూ 88 మంది మహిళా సభ్యులు నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు . ఈ సభ్యత్వం ద్వారా ప్రభుత్వ రుణాలకు , సంఘ సభ్యుల ఉపాధి కొరకు , జీవన విధానం లో మార్పు రావాలి అని , ప్రకాష్ నగర్ లో ఉన్న ముదిరాజ్ బంధువులను 28.29 డివిజన్ల అందరూ కల కలుపుకొని ఘనంగా బోనాల పండగ ను ఏర్పాటు చేసుకున్నారు . ఈ కార్యక్రమంలో మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లి॥ ప్రకాష్ నగర్ 28 & 29 డివిజన్లు అధ్యక్షురాలు పోతుల హైమావతి , ఉపాధ్యక్షురాలు శీలం విజయలక్ష్మి , సెక్రటరీ గుండెబోయిన హైమావతి , అద్యక్షుడు చెన్నబోయిన వెంకటేశ్వర్లు , ఉప అధ్యక్షుడు పోతుల నరసింహారావు , సెక్రటరి ఆముదాల లక్ష్మణ్ , కమిటీ నెంబర్స్ దుస్స శ్రీను , బండి కనకయ్య , గుండెబోయిన నరేష్ , నక్క లింగయ్య , గణవరపు వెంకన్న , రావుల శ్రీను , నార్ల నాగేశ్వరరావు మరియు ముదిరాజ్ కుల పెద్దలు పాల్గొన్నారు .