తడిసి ముద్దయిన నియోజకవర్గం

బతుకమ్మ,మోర్తాడ్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు బాల్కొండ నియోజకవర్గం తడిసి ముద్దయింది. నియోజకవర్గంలో పేదవాగుపై నిర్మించిన 10 చెక్ డ్యాములపై నుంచి నీరు భారీగా ప్రవహిస్తోంది. బాల్కొండ నియోజకవర్గంలో మొత్తం 292 చెరువులు ఉండగా 91 చెరువులు అలుగు పారుతున్నట్లు అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. అలాగే పలు గ్రామాల్లోని చెరువులు నిండుకుండలా జలకల సంతరించుకొన్నాయి. నియోజకవర్గంలో కొన్ని మండలాలలో మొక్కజొన్న, సోయా, వరి పంటలు అక్కడక్కడ నీట మునిగినాయి. నియోజకవర్గంలోని స్పెషల్ ఆఫీసర్లు( ప్రత్యేక అధికారులు) ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కురుస్తున్న భారీ వర్షాలకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నారు. నియోజకవర్గంలోని భీమ్ గల్ మున్సిపాలిటీలో అత్యవసర సహాయక చర్యల నిమిత్తం కంట్రోల్ సైతం ఏర్పాటు చేశారు.

A wet constituency

Leave A Reply

Your email address will not be published.