వామ్మో ఇంట్లోకి పాము..,

 

 కొల్చారం, అక్టోబర్ 03 (అక్షరకలం వెబ్ ):

కొల్చారం మండలంలోని చిన్న గణపూర్ గ్రామం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న ముత్తయ్య జర్నలిస్ట్ ఇంటిలోకి ఈరోజు సాయంత్రం సుమారు 6 గంటలకు సమయంలో  పాము రావడం జరిగింది. దాన్ని చూసి కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీయడంతో అది చూసిన చుట్టుపక్కల వారు కొందరు వచ్చి కర్రలతో దాన్ని కొట్టి చంపడం జరిగింది ఇంటి ఆవరణలో లైట్లు లేకపోవడం ఇండ్ల చుట్టూ చెట్ల పొదలు మరుగు ఉండడంవల్ల పాములు తిరుగుతున్నాయని అవి ఇండ్లలోకి వస్తున్నాయని పలుమార్లు గ్రామపంచాయతీ వారికి చెప్పినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని దీనివలన ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బతకవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకొని  కాలనీ ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎస్సీ కాలనీ ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.