నందికొండ లో 15 కోట్లతో పట్టణ రోడ్ల నిర్మాణానికి ఏర్పాట్లు

—త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభం

—-12 వార్డుల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికలు

—-సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం

—-మాజీ జెడ్పి వైస్ చైర్మన్ లింగారెడ్డి

అక్షర కలం నాగార్జునసాగర్ / నందికొండ :–

నందికొండ మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి తనదైన శైలిలో అభివృద్ధి పనులను పరిశీలించారు,మున్సిపల్ ఎన్నికల ముందే నగరాభివృద్ధి కోసం రూ.15 కోట్ల భారీ నిధులు మంజూరు కావడంతో,ఇప్పుడు ఆ నిధులను క్షేత్రస్థాయిలో సద్వినియోగం చేసేలా స్వయంగా రంగంలోకి దిగారు.
క్షేత్రస్థాయి పర్యటన సమస్యల గుర్తింపు
మంగళవారం నందికొండ పట్టణంలోని 12 వార్డులలో కర్నాటి లింగారెడ్డి నందికొండ మున్సిపల్ చైర్మన్ మానస స్వర్ణ కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు,దశాబ్దాల కాలంగా మరమ్మతులకు నోచుకోని రోడ్లను పరిశీలించి,వాటి స్థానంలో నూతన రోడ్ల నిర్మాణానికి పక్కా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ ఏఈ సురేష్‌ను ఆదేశించారు,ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ,అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.మంజూరైన 15 కోట్ల నిధులకు సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.పారదర్శకంగా,నాణ్యతతో కూడిన పనులు జరిగేలా టెండర్ల ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.నాయకత్వ అభివృద్ధికి లింగారెడ్డి పర్యటనతో స్థానిక ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి.ఎన్నికలకు ముందే భారీ నిధులు తీసుకురావడమే కాకుండా,వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం అభివృద్ధి కాంక్షకు నిదర్శనమని స్థానికులు కొనియాడుతున్నారు.అధికారులకు మరియు కౌన్సిలర్లకు మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తూ,నందికొండ ముఖచిత్రాన్ని మార్చేందుకు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులు,నాయకులువార్డు ప్రజలు పాల్గొని తమ సమస్యలను లింగారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

Leave A Reply

Your email address will not be published.