గుండెపోటుతో మృతి చెందిన జర్నలిస్ట్ బాస్కర్ కుటుంబానికి 1.40 లక్షల ఆర్థిక సహాయం చేసిన టివి 5 బృందం….
మిర్యాలగూడ,సెప్టెంబర్ 11 (అక్షర కలం): తమతో కలిసి మెలిసి పనిచేసిన వ్యక్తి విధి వక్రీకరించి,గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవడం తో పెద్దదిక్కును కోల్పోయి దిక్కుతోచని స్థితిలో వున్న ఆ కుటుంబానికి తామున్నామంటూ భరోసా కల్పించారు టివి 5 ఉమ్మడి నల్లగొండ జిల్లా రిపోర్టర్ల బృందం. ఇటీవల టీవీ5 మిర్యాలగూడ రిపోర్టర్ గా పనిచేస్తున్న దండ భాస్కర్ గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించాడు. అతనికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రిపోర్టర్ గా సంఘంలో మంచి పేరు తప్ప ఆర్థికంగా కూడబెట్టక పోవడంతో, అతని ఆకస్మిక మరణంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. పరిస్థితి తెలుసుకున్న

టీవీ5 ఉమ్మడి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా టీవీ5 రిపోర్టర్లు వారి శక్తి కొలది 1.40 లక్షల రూపాయలు పోగేసారు ఈదుల గూడా లోని భాస్కర్ ఇంటికి చేరుకొని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించి 1.40 లక్షల నగదును అందజేశారు ఈ కార్యక్రమంలో భాస్కర్ కుటుంబ సభ్యులు, ఉమ్మడి జిల్లా రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు