నర్సాపూర్ , సెప్టెంబర్ 05( అక్షర కలం):-
మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న గణపురం ఐ ఎం ఎల్ డిపోలో .. గతంలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసిన… కొంతమంది.. రిటర్మెంట్ అయ్యారు… వారి స్థానంలో కొత్తవారిని నియమించారని తెలుసుకున్న చిన్న ఘనాపూర్ గ్రామ నిరుద్యోగ యువకులు గతంలో ఉపాధి లేక ఐ ఏం ఎల్ డిపో ముందు హమాలీ పని కోసం, సెక్యూరిటీ గార్డ్ కోసం, డిపోలో ఏదైనా సపాయి పని కానీ, ఆఫీస్ బాయ్ గా కానీ పని దొరుకుతదేమో అని గత రెండు నెలలు పగలు రాత్రి అనక టెంటు వేసుకొని కూర్చున్న రోజులు ఉన్నాయి. తీరా ఆరాతిస్తే గతంలో ధర్నా చేసిన హమాలి యూనియన్ సంఘంలో నుండి ఐదుగురు సభ్యులను హమాలి సంఘం యూనియన్ సంఘ సభ్యులకు తెలియకుండా సెక్యూరిటీ గార్డ్ పోస్టింగ్ ఇచ్చినట్లు తెలుసుకున్న చిన్నగనాపూర్ నిరుద్యోగ యువకులు

శుక్రవారం ఉదయం ఐఏంఎల్ డిపో ముందు ధర్నాకు దిగారు. సుమారు 150 వరకు అమాలి యూనియన్ సభ్యులు ఉన్న వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఐఎంఎల్ డిపోలో సెక్యూరిటీగా ఒక్కరోజు డ్యూటీ చేస్తున్నారని తెలుసుకున్నారు. గ్రామ యువకులు వారిని బయటకు పంపేంతవరకు డిపో ముందు ధర్నా చేస్తామని చెప్పడంతో

కొల్చారం పోలీసులు డిపో వద్దకు చేరుకొని నిరుద్యోగ యువకులను సముదాయించి మీరు ఏమైనా మాట్లాడుకోవాల్సి ఉంటే మీ ఊరు పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలని నిరుద్యోగ యువకులకు సముదాయించడంతో అక్కడి నుండి యువకులు వెళ్లిపోయారు.