జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి……
నల్లగొండ, సెప్టెంబర్ 5 (అక్షరకలం )ప్రతినిధి:
గ్రామ పాలనాధికారులుగా నియమితులైన జిల్లాకు చెందిన అభ్యర్థులు శుక్రవారం హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ .రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకునేందుకు 3 బస్సులలో వెళ్లడం జరిగింది.
ఈ బస్సులకు ఎన్జీ కళాశాల మైదానం వద్ద జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి పంపించారు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామ పాలన అధికారులుగా నియమించబడిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో వై .అశోక్ రెడ్డి.నల్గొండ తహసీల్దార్ పరుశురాములు, ఇతర అధికారులు ఉన్నారు.