పోతంశెట్టిపల్లి పాఠశాలలో… ఎన్ఎస్ఎస్…

– రెండవ రోజు షీ టీమ్స్ మహిళ విద్యార్థులకు అవగాహన…

అక్షర కలం వెబ్  సెప్టెంబర్,18  కొల్చారం:

కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ఆధ్వర్యంలో నిన్న ప్రారంభమైనటువంటి ప్రత్యేక శిబిరంలో రెండవ రోజు షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళలు విద్యార్థులు తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో షీ టీమ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి వెంకటయ్య గారు అదేవిధంగా శంకరయ్య హెడ్ కానిస్టేబుల్ గారు విజయకుమార్ పోలీస్ కానిస్టేబుల్ గారు మహిళా షీ టీమ్ సభ్యులైనటువంటి ప్రమీల గారు పాల్గొనడం జరిగింది వీరు తమ యొక్క ప్రసంగంలో షీ టీమ్స్ వాళ్ల యొక్క పరిశోధనలో వచ్చినటువంటి అనేక అమ్మాయిలు వాళ్లకి సంబంధించిన కేసులగురించి కూడా విద్యార్థులకు తెలియడం జరిగింది ఈ కార్యక్రమంలో అమ్మాయిలు అనుసరించవలసిన జాగ్రత్తలు అదేవిధంగా మోసపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే వాళ్ళు సూచించడం జరిగింది. మీరు ఎవరికైనా అమ్మాయిలకు ఏమైనా సమస్యలు ఉంటే షీ టీమ్ వారు తమ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత కాలంలో వచ్చేటువంటి ఇంటర్నెట్ సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులు అదేవిధంగా యువకులు అమ్మాయిలు ఏ విధంగా ఇన్స్టాల్ గ్రామ్ లాంటి సాధన ద్వారా మోసపోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.