ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ప్రారంభం…

 ––సామాజిక బాధ్యతను చాటుకుంటున్న గాంధీజీ ఫౌండేషన్ 

అక్షరకలం, చండూరు 

ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక వాటర్ ట్యాంక్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం ‘కోడి బ్రదర్స్’ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ..ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్నదని, నిత్యం పరిసర గ్రామాల నుండి చండూరు పట్టణానికి వివిధ పనుల కోసం ప్రజలు వస్తుంటారని, వారి దాహార్తిని తీర్చడానికి ఇలాంటి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గాంధీజీ ఫౌండేషన్ ప్రతినెల నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు… సామాజిక అవసరాల కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుందని తెలిపారు. ఎండలు మండిపోతున్న తరుణంలో బాటసారులకు, ప్రయాణికులకు చల్లని సురక్షితమైన నీటిని అందించడం మాకు ఆనందంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు కోడి సుష్మా వెంకన్న, బుషిపాక వాసు, కటకం రమేష్, కో ఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య సాగర్, ఖలీల్, షరీఫ్ , మొగుదాల వెంకన్న, కారింగు రామ్మూర్తి, పున్న ధర్మేందర్, భీమనపల్లి శేఖర్, ఐతరాజు మల్లేష్, పందుల సత్యం, బోడ వెంకటేశం, గజ్జల కృష్ణారెడ్డి, ఇరిగి వెంకటేశం, సంగెపు శ్రీనివాసులు, సరికొండ వెంకన్న, బోడ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.