నాగార్జున సాగర్, అక్టోబర్ 01 (అక్షర కలం వెబ్):
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి స్పీల్ వే ద్వారా దాదాపు 5 లక్షల పైన క్యూసెక్కుల వరద నీరు విడుదల అవుతూ ఉండటంతో కృష్ణానది వద్ద జలకళ సంతరించుకుంది. వరదనీరు భారీగా పెరగడంతో వరద పోటెత్తుతున్న పరివాహక ప్రాంతాలు అదే విధంగా పుష్కర ఘాట్ల వద్దకు ప్రజలు, పర్యాటకులు వస్తూ ఉండటం తరచూ ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతూ ఉండటంతో బుధవారం నాడు మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో స్థానిక సీఐ శ్రీను నాయక్,
ఎస్ఐ ముత్తయ్య, తిరుమలగిరి ఎస్సై వీరశేఖర్, పెద్ద వూర ఎస్ ఐ ప్రసాద్
రెవెన్యూ అధికారి అనిల్ తో కలిసి సంబంధిత ప్రమాదాలు జరిగే ప్రాంతాల వద్ద రక్షణ చర్యలను పరిశీలించారు.
శివాలయం పుష్కర్ ఘాట్ వద్ద గేట్లను మూసివేయాలని, ప్రమాద భరితంగా ఉన్న ఓపెన్ స్థలాల్లో పెద్ద మొత్తంలో ముళ్ళకంచవేసి పర్యాటకులు ఎవరిని అటువైపు రాకుండా చూడాలని డి.ఎస్.పి ఆదేశించారు. కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గత నెలరోజుల వ్యవధిలో నాగార్జునసాగర్ ను తిలకించేందుకు వచ్చిన ముగ్గురు పర్యాటకులు అవగాహన లేక లోతుకు వెళ్లి గల్లంతయ్యారు ఇలా ఏటా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. నాగార్జునసాగర్ డ్యాం గేట్లు తెరిచి ఉన్నన్ని రోజులు పుష్కర ఘాట్ల వద్ద సి ఆర్ పి ఎఫ్ జవాన్లను అక్కడ ఉండడం వలన కొంతమేర ప్రాణా నష్టం తగ్గిందని స్థానికులు తెలుపుతున్నారు.తాజాగా మంగళవారం హైదరాబాదు నుంచి వచ్చిన విద్యార్థులలో ఒక విద్యార్థి గల్లంతు అవటం
ఆ విద్యార్థి ఆచూకీ ఇంతవరకు లభించకపోవడం గమనార్హం డీఎస్పీ వెంట సాగర్ ప్రాజెక్టు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్ ఐ శ్రీనివాస్ రావు, రెవెన్యూ అధికారులు, స్థానిక పర్యావరణ ఇంజనీర్ బాలాజీ ఉన్నారు.