మెదక్ జిల్లా ప్రజలకు అధికారులకు దసరా శుభాకాంక్షలు తెలిపిన…- మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు…

మెదక్, అక్టోబర్ 01(అక్షర కలం వెబ్ ):-

విజయదశమి పండుగ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమిని దుష్ట శక్తులపై విజయం సాధించిన పండుగగా భావిస్తూ, ప్రజలందరూ ఐక్యత, సమగ్రతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో తేజస్సు, ఆనందం మరియు విజయాన్ని నింపాలని కోరుతూ, పండుగ ఉత్సవాలను సోదరభావంతో, సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. అంతేకాక, నవరాత్రుల అనంతరం జరిగే దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను కూడా శాంతియుతంగా, క్రమబద్ధంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.