బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా…

మంగపేట’ ఆగస్టు 23 ( అక్షర కలం ) :

రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏటునాగారం బూర్గంపాడు ప్రధాన రహదారిపై మల్లూరు వద్దశనివారం ఉదయం ధర్నా, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా, చెల్లించాలని, యూరియా కొరత చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు ఇచ్చుకుంటూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ములుగు మాజీ జెడ్పి చైర్ పర్సన్ బడే నాగజ్యోతి, టిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పోరిక గోవింద నాయక్, మంగపేట రైతు సేవా సహకార సంఘం చైర్మన్ తోట రమేష్, వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు తాటి కృష్ణ, భూక్య జంపన్న, మండలంలోని టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.