పోలీస్ స్టేషన్లో మత పెద్దలతొ సమావేశం.

పోలీస్ స్టేషన్లో మత పెద్దలతొ సమావేశం.

కొండ మల్లెపల్లి. ఆగస్టు 22 (అక్షర కలం )

కొండమల్లేపల్లి పట్టణంలోని పోలీస్ స్టేషన్లో వినాయక చవితి, నిమజ్జనం ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సిఐ నవీన్ కుమార్ అన్నారు. కొండమల్లేపల్లి ఎస్సై అజ్మిరా రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు కుల సంఘాలు మత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మాట్లాడుతూ హిందు ముస్లిం సోదరులు ప్రశాంతమైన వాతావరణం లో వినాయక చవితి జరుపుకోవాలని శోభాయాత్ర సమయంలో జనానికి ఇబ్బందులు కలుగకుండా జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలరాజు ఎమ్మార్వో నరేందర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.