గోశాలలోకి వరద నీరు రానీయొద్దు

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ: నగరంలోని నాగారం గుట్ట మీదుగా వచ్చే వర్షపునీరు గోశాలలోకి రాకుండా, అక్కడక్కడ నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ అధికారులను ఆదేశించారు. గోశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. మున్సిపల్ ఇంజినీరింగ్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో, సరైన ప్రణాళికతో డ్రైనేజీ నిర్మాణం చేపట్టి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఆయన వెంట అసిస్టెంట్ ఇంజినీర్ సోలోమాన్, శానిటరీ ఇన్ స్పెక్టర్ ప్రభుదాస్, మల్లారం తండా వాసులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.