మాయావతి జన్మదిన బహిరంగ సభ ను విజయవంతం చేయండి

 

బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్, అడ్వకేట్ నిషాని రామచంద్రం

అక్షర కలం, మంచిర్యాల జిల్లా ప్రతినిధి, 

జనవరి 15న మాయావతి జన్మదినం సందర్భంగా జన్ కళ్యాణ్ కారి దివస్ బహిరంగ సభ ను విజయవంతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్, అడ్వకేట్ నిషాని రామచంద్రం కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని నీలకంటేశ్వర ఆస్పత్రిలో జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర కోఆర్డినేటర్, అడ్వకేట్ నిషాని రామచంద్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో బీఎస్పీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించారు. పట్టణ కమిటీ లను, వార్డ్ కమిటీ లను ఏర్పాటు వేయాలని తెలిపారు.

బహుజన ఉద్యమ బలోపేతం కోసం ప్రజల నుండి విరాళాలు సేకరించాలని కార్యకర్తల ను కోరారు. జనవరి 15న బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి 70వ జన్మదినం సందర్బంగా జోన్ స్థాయి లో నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే జన్ కళ్యాణ్ కారి దివస్ బహిరంగ సభ కు జిల్లా నుండి ఎక్కువ జన సమీకరణ చేయాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జోన్ ఇంచార్జ్ కాదసి రవీందర్, జిల్లా ఇంచార్జ్ లు నాగుల కిరణ్ బాబు, దాగం శ్రీనివాస్, రామకృష్ణపూర్ పట్టణ అధ్యక్షులు బొల్లి నరేష్, గాజుల శంకర్, ఎండి మాతిన్ ఖాన్, రహీం బాబా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.