– కొల్చారం మండలం బి ఆర్ఎస్ పార్టీ నాయకులు…
కొల్చారం, అక్టోబర్ 28 ( అక్షర కలం వెబ్ ):-
మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం తీవ్ర బాధాకరం, వారి నివాసం హైదరాబాద్ లో వారి పార్థివ దేహానికి మెదక్, కొల్చారం మండలాల టిఆర్ఎస్ పార్టీ నేతలు మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ళ మల్లికార్జున్ గౌడ్, కౌడిపల్లి సబ్ డివిజన్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ యాబన్నగారి మల్లారెడ్డి, మెదక్ జిల్లా నాయకులు మామిళ్ళ ఆంజనేయులు, బీమారి కిషోర్, జయరాజ్, రంజిత్, అరుణ్,లడ్డు, కొల్చారం మండలం టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముత్యం గారి సంతోష్ కుమార్, మండల టిఆర్ఎస్ యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు, టిఆర్ఎస్ పార్టీ యూత్ ఐకాన్ రవితేజ రెడ్డి, తుక్కాపూర్ ఆంజనేయులు తదితరులు ఉన్నారు.