జూబ్లీహిల్స్ లో ఊపందుకున్న ఇంటింటి ప్రచారం….  

కొల్చారం, నవంబర్ 04( అక్షర కలం వెబ్ ):- 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం ఊపందుకుంది . జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , ఎంపీ సురేష్ షేట్కర్, తో ఎక్స్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ మొహి నుద్దీన్ కలిసి మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ సురేష్ సెట్కర్ ఎక్స్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ మొహియుద్దిన్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పథకాలను ఓర్వలేక కల్లబొల్లి మాటలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్, పార్టీకి చెప్పు పెట్టు లాగా నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించడం ఖాయమని ఆయన అన్నారు. ప్రచారంలో భాగంగా వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.