ఉచితంగా ఆవు పాల పంపిణి

రుద్రూర్, ఆగస్టు 9 (బతుకమ్మ) : నాగుల పంచమిని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం విశ్వహిందు పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వంద లీటర్ల ఆవుపాలు ఉచితంగా పంపిణి చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలోని జీపీ, అంగడిబజార్, జేఎన్సీ కాలనీలో పాలు పంపిణీ చేశారు. గత 14ఏండ్లుగా ఈ సంస్థలు పంచమి రోజున ఉచితంగా ఆవు పాలు పంపిణి చేస్తున్నారు. అలాగే గాంధీ చౌక్ వద్ద ప్రముఖ వ్యాపారి బచ్చు రాము స్థానికులకు ఉచితంగా అవు పాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు పార్వతి మురళి, ప్రశాంత్ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.