మంగపేట, ఆగస్టు 28 ( అక్షర కలం ) :
గణపతి నవరాత్రి ఉత్సవాలు మండల వ్యాప్తంగా బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మండలంలో మహా గణపతి వాడవాడలా కొలువుదీరాడు. మండలంలోని ఏ వీధి చూసినా వినాయక మండపాలు కనిపిస్తున్నాయి. విభిన్న రూపాల్లో గణపయ్య భక్తులకు దర్శనమిస్తున్నాడు. మండపంలో కొలువుదీరిన బొజ్జ గణపయ్య ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తుల పూజలందుకుంటున్నాడు. మండపాలను నిర్వాహకులు ఆకర్షణీయంగా రూపొందించారు. వినాయక విగ్రహాలను పండ్లు, పూలు, పత్రితో అలంకరించారు. ఆయా మండపాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది.
.