*ప్రియుడితో కలిసి మామను హతమార్చిన కోడలికి,ప్రియుడికి జీవిత ఖైదు జరిమాన.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.*
నల్లగొండ, ఆగస్టు 29 (అక్షర కలం) ప్రతినిధి :
నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన బొబ్బలి పద్మ W/o లింగయ్య ఆమె ప్రియుడు అవుల వేణు S/o రాములుకు నల్గొండ IV ADJ కమ్ ఉమెన్స్ కోర్టు Cr.No.236/2017,SC.No.166/2018
U/s 302,341,201 r/w 34 IPC ప్రకారం జీవిత ఖైదు మరియు జరిమాన విధిస్తూ తీర్పు వెలువడించిందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
కేసు వివరాలు
నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన బొబ్బిలి పద్మ అదే గ్రామానికి చెందిన ఆవుల వేణుతో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధం కొనసాగిస్తూ తేది 03-08-2017 నాడు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో వీరిద్దరూ కలిసి ఉన్నారు. బావి వద్ద నుండి మధ్యానం అన్నం తినడం కొరకు వచ్చిన మామ అయిన భిక్షమయ్య వీరిద్దరు కలిసి ఉన్నది చూసి తన కుమారుడికి ఇట్టి విషయం గురించి చెపుతానని అనగా ఇద్దరు కలిసి హత్య చేసి మద్యం సేవించి కింద పడిపోయి తలకు బలమైన గాయం తలిగి చనిపోయాడు అని చిత్రీకరించి తన భర్త లింగయ్యకు పద్మ తెలిపింది.ఇట్టి విషయం పై పోస్ట్ మార్టంలో కొట్టి హత్య చేయడం జరిగిందని తేలడంతో అసలు విషయం ఒప్పుకున్న నిందితులపైన నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో Cr.No.236/2017,SC.No.166/2018 U/s 302,341,201 r/w 34 IPC క్రింద కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జ్ దాఖలు చేయగా నేడు గౌరవ నల్లగొండ నల్గొండ IV ADJ కమ్ ఉమెన్స్ కోర్టు నిందితులకు జీవిత ఖైదు జరిమాన విధిస్తూ తీర్పు వెలువడించిందని తెలిపారు.
ఈ కేసులో సరైన ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులు కె.సుబ్బ రామి రెడ్డి సీఐ,వై.సీనయ్య హెడ్ కానిస్టేబుల్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకట రమణ రెడ్డి,అలాగే నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి గారి పర్యవేక్షణలో ప్రాసిక్యూషన్ కి సహకరించిన ఎన్.వెంకటేష్ నక్రేకల్ సీఐ. C.D.Oలు,ఎన్.వెంకటేశ్వర్లు,ఎ.సుధాకర్,కోర్ట్ లైజెనింగ్ అధికారులు నరేందర్, మల్లికార్జున్ లని జిల్లా ఎస్పీ గారు అభినందించారు.