పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ 90 వ జయంతి వేడుకలు

  • బంగారు తెలంగాణ కోసం ఆయన ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

              బతుకమ్మ న్యూస్,  నిజామాబాద్ సిటీ 

నిజామాబాద్ పోలీసు కమీషనరేటు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవర్ ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోకు పూలమాలలు వేసిన అనంతరం అదనపు పోలీస్ కమీషనర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ 1934 ఆగష్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో జన్మించారని 1952 సంవత్సరాల ముల్కీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1954లో రాష్ట్రాల పునర్వీభజన కమీషన్ ముందు యువకుడైన జయశంకర్ ధాటిగా వాదించారన్నారు. కాకతీయ యూనివర్సీటీ వైస్ చాన్సలర్ గా ఎదిగరని, సామాజిక తెలంగాణ అంటూ ముందుకొచ్చి ఉద్యమ ధోరణులపట్ల స్పందిస్తూ, భౌగోళిక తెలంగాణను సాధించుకొన్న తరువాతే. మిగతాకోణాలపై దృష్టిపెట్టాల్సి ఉంటుందని చెప్పేవారని గుర్తు చేశారు . తెలంగాణ నా కల అని పదేపదే చెప్పే వారని తెలిపారు. ప్రతి ఒక్కరు బంగారు తెలంగాణ కోసం శ్రమించాలని, భవిష్యత్ తరాలకోసం అనునిత్యం ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలన్నారు. భావితరాల కోసం బంగారుబాట వేయాలని పోలీస్ శాఖ సిబ్బందికి అదనపుపోలీస్ కమీషన్ పిలుపునిచారు. ఈ జయంతి సందర్భంగా అదనపు డి.సి.పి (అడ్మిన్) బి.కోటేశ్వరరావు అదనపు పోలీస్ కమీషనర్ (ఎ.ఆర్) శంకర్ నాయక్, ఎ.ఓ. శ్రీనివాస్ ఆఫీస్ సూపరింటెండెంటు శంకర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ బషీర్, పోలీస్ కార్యాలయ సిబ్బంది, సి.సి.ఆర్.బి, సి.ఎస్.బి, ఐ.టి కోర్, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.