- మాచారెడ్డి లో బీఆర్ఎస్ ఆందోళన
బతుకమ్మ, మాచారెడ్డి: ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని మాచారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆందోళన నిర్వహించింది. అధిష్టానం పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు పగడాల బాలచంద్రం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామి తోపాటు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు మాఫీ చేస్తామని మాట ఇచ్చి కేవలం 30 శాతం మంది రైతులకు మాత్రమే మాఫీ చేసి, అందరికి మాఫీ చేశామని చెప్పుకోవడం చాల విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన మాట ను నోలబెట్టకోవాలంటే బే షరతుగా రైతులకు రెండు లక్షల మాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతుల పక్షాన ప్రభుత్వం దిగివచ్చేవరకు బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రాజా గౌడ్, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్షులు, ముఖ్య నాయకులు బూస శ్రీనివాస్, బట్ట రమేష్ , గంగారెడ్డి, శ్రీశైలం, బెల్లపు చంద్రం, బాబు, శేఖర్,
నారాయణ,తదితరులు పాల్గొన్నారు.