క్రీడలతో స్నేహభావం శారీరక దారుఢ్యం పొందుతుంది

 

 కొల్చారం, జనవరి11(అక్షర కలం)

క్రీడాలతో స్నేహభావం పోతుందని పైతర సర్పంచ్, కొల్చారం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు యావన్న గారి రవితేజ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ -3 శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పైతర సర్పంచ్ యబన్నగారి రవితేజ రెడ్డి, ఉప సర్పంచ్ సుధాకర్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రవితేజ రెడ్డి మాట్లాడుతూ యువకులంతా ఉత్సాహంతో క్రీడా పోటిలో పాల్గొనడం ఆనందదాయకం అన్నారు. విజేతలకు ఈనెల 14వ తేదీన ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ పోచయ్య, యాదయ్య, భూమేష్, రాజా గౌడ్, పెంటయ్య, శంకరయ్య, మాజీ ఎంపిటిసిలు చంద్ర శేఖర్ రెడ్డి, ఆరట్ల ఎల్లయ్య, మాజీ సర్పంచులు మురళి గౌడ్, ఎల్లేశం మాజీ వార్డ్ మెంబర్స్ 4 టీమ్ల స్పాన్సర్స్ సోమన్న గారి సమరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ లు భాను ప్రకాశ్ రెడ్డి, వెన్మకన్నే ఎల్లేశం, పుట్టి శివకుమార్, కుసంగి ప్రభాకర్ ఆర్గనైజర్సు, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.