*ఎన్నికల ముందు పంచిన డబ్బు తిరిగియాలంటూ సర్పంచ్ అభ్యర్థి గ్రామస్తులపై నిరసన*

 

* దేవుడి ఫోటో, పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇంటింటికి తిరిగిన దంపతులు

* నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఔరవాణిలో ఘటన

నకిరేకల్ నియోజకవర్గం : అక్షర కలం

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి నార్కట్ పళ్లి మండలం ఔరవాణి గ్రామంలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఔరవాణి గ్రామంలో మొత్తం ఓట్లు 1490 ఉండగా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జక్కల పరమేష్ కు 973 ఓట్లు రాగా, టిఆర్ఎస్ బలపరిచిన కల్లూరి బాలరాజుకు 517 ఓట్లు వచ్చాయి గ్రామంలోని టిఆర్ఎస్ పార్టీకి చెందిన కల్లూరి బాలరాజు అభ్యర్థి గ్రామంలో ఓటుకు రూ 2 వేలు రూపాయలు డబ్బు పంచినప్పటికీ 456 ఓట్లతో బాలరాజు ఓడిపోయాడు. ఇంత డబ్బు పంచిన మెజారిటీ రాకపోవడంతో బాలరాజు దంపతులు ఒకరు చేతిలో దేవుడు ఫోటో పట్టుకొని , అతని భార్య పురుగుల మందు డబ్బాతో ఇంటింటికి తిరిగి ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని, నిజాయితీగా నాకు ఓటు వేసిన వారు అవసరం లేదని, వేయనివారు కచ్చితంగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలంటూ గ్రామస్థులతో బాలరాజు వాగ్వాదం చేశాడు. యాభై లేదా వంద ఓట్ల తేడాతో ఓడిపోతే ఏమైనా అనుకోవచ్చు కానీ ఇంత డబ్బు పంచినా ప్రత్యర్థి అయినా జక్కల పరమేశ్ లవ్ బారీ ఎత్తున మెజారిటీ ఎలా వచ్చిందంటూ గ్రామస్థులతో బాలరాజు దంపతులు దిగారు. గ్రామస్తులు సైతం బాలరాజు దంపతులకు ఎదురు వాగ్వాదానికి దిగారు. మీ ఇంటికి ఏమైనా డబ్బులు ఇవ్వమని వచ్చామా అంటూ గట్టిగానే నిలదీశారు. గ్రామంలోని ప్రజలు ఇటువంటి సంఘటనలు ప్రతి ఓటర్ కు ఒక కనువిప్పు కావాలని, ఓట్ల ముందు డబ్బులు తీసుకుని ఓటు వేస్తే ఇలాంటి పరిస్థితులే గ్రామ ప్రజలకు ఎదురవుతాయని , ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీగా ఓటు వేసి సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.