కార్పొరేటర్ శివచరణ్ పై పోలీసు కేసు

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం

నిజామాబాద్ నగరంలోని 40వ డివిజన్ కార్పొరేటర్ పై 3వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల చివరి వారంలో గౌతమ్ నగర్ కి చెందిన డివిజన్ కార్పొరేటర్ అయిన శివచరణ్ తన ఇంటి ముందు నుండి సురేష్ అనే వ్యక్తి వెళుతున్నప్పుడు అతనిని అడ్డుకొని తన ఇంటి ముందు నుండే వెళ్తావా అని బూతు మాటలు తిట్టి, అతని తమ్ముడు ప్రమోద్ తో కలిసి దాడి చేశారు. గాయపడిన సురేష్ సోమవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సురేష్ ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ శివ చరణ్, అతని తమ్ముడు ప్రమోదుల పై 3వ  టౌన్ ఎస్సై మహేష్  కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.