పెద్ద కాపర్తి చెరువులో చేప పిల్లల విడుదల

చిట్యాల : నవంబర్ 5 (అక్షర కలం,వెబ్ )

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి చెరువులో తెలంగాణ ప్రభుత్వం చే ఉచితంగా మంజూరైన 72 వేల చేప పిల్లలను బుధవారం వెలిమినేడు సింగిల్ విండో చైర్మన్ రఘుమారెడ్డి చెరువులోకి వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశం మేరకు మత్స్య, కార్మిక సంఘం పెద్దకాపర్తి గ్రామానికి మంజూరైన 72 వేల బొచ్చ, రవ్వ, మెరికె చేప పిల్లలను చెరువులోకి వదిలామని అన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని అందులో భాగంగానే స్థానిక ఎమ్మెల్యే చెరువులను అభివృద్ధి చేసి మత్స్య పరిశ్రమ అభివృద్ధి అయ్యేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార శాఖ ఏడి రాజారామ్, సూపరింటెoడెంట్ వీరమల్ల శ్రీనివాస్ పెద్ద కాపర్తి మత్స్య కార్మిక సంఘం సొసైటీ అధ్యక్షులు బుంగపట్ల తిమ్మయ్య, కోశాధికారి నూతి తిరుమలేష్, మాజీ అధ్యక్షుడు బైరగొని బిక్షం, నూతి వెంకటేష్, మోర సత్యం, మూర సత్తయ్య, నూతి సతీష్, యాదయ్య, దేశగోని గోపాల్, స్వామి, నరసింహ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.