ఘనంగా పదవీ విరమణ సన్మాన కార్యక్రమం…..

హైదరాబాద్ ఆగస్టు ,30 (అక్షర కలం )ప్రతినిధి :

             శనివారం  HMWSSB కార్యాలయంలో నిర్వహించిన సీనియర్, ఆఫీసర్. శ్రీ లిక్కీ ప్రభాకర్ రెడ్డి,పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన  సిజిఎం లు, జిఎంలు, డీజీఎంలు, యూనియన్ లీడర్లు, మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగుల బాధ్యత అతి కీలకమని  39 సంవత్సరాలు వివిధ హోదాలో వారు చేసిన సేవలను కొనియాడుతూ  మిగిలిన శేష జీవితం ఆయురారోగ్యలతో, సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటున్నామన్నారు.
తదనంతరం  శ్రీ లిక్కి  ప్రభాకర్ రెడ్డి, మాట్లాడుతూ 39 సంవత్సరాలు వివిధ హోదాలో  కుటుంబ సభ్యుల సహకారం తో,నిబద్దత తో విధులు నిర్వహిస్తూ ఎంతో మంది ప్రజలకి సేవ చేయటం చాలా అదృష్టం అన్నారు.
పదవి విరమణ పొందుతున్న తన అనుభవాలు స్మరించుకుంటూ జీవితంలో కష్టే ఫలి అని నమ్మి తన ఉద్యోగ సర్వీసులో  ప్రజలకి పనికొచ్చే ఏ విషయంలో పెండింగ్ పెట్టకుండా విధులు నిర్వహించానని, మనం చేసే విధుల ద్వారానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. తన ఉద్యోగ రీత్యా విధులకు సహాయ సహాకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమానికి సిజిఎంలు, ( ఇంజనీర్ ) పి వినోద్ భార్గవ, నాగేంద్ర కుమార్, యూనియన్ లీడర్, స్టేట్ ప్రెసిడెంట్ రాంబాబు యాదవ్, జిఎం  ( ఇంజనీర్) శ్రీనివాస్ నాయక్, సుగందిని, సహచర ఉద్యోగులు తదితరులు పాల్గొని శాలువా పూలమాలతో సన్మానించినారు.

Leave A Reply

Your email address will not be published.