పర్యావరణ హితానికి పచ్చని జీవనశైలికి సైక్లింగ్ ఎంతో దోహదం చేస్తుంది:

 

రాష్ట్ర గవర్నర్ జీష్ణుదేవ్ వర్మ:

హైదరాబాద్: ఆగస్టు 31,( అక్షర కలం ):

జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు గచ్చిబౌలి స్టేడియం వద్ద జరిగిన *ఫిట్ ఇండియా- సండేస్ ఆన్ సైకిల్* కార్యక్రమానికి గౌరవనీయ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి సైక్లింగ్ ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణహితానికి, పచ్చని జీవనశైలికి సైక్లింగ్ ఎంతో దోహదం చేస్తుందని, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన సైక్లింగ్ ను తెలంగాణలో విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు.

భారత ప్రభుత్వం విస్తృతంగా చేపట్టిన సండేస్ ఆన్ సైక్లింగ్ అనే కార్యక్రమాన్ని జాతీయ ఫిట్నెస్ ఉద్యమంలా తెలంగాణలో నిర్వహించాలని
” ఫిట్నెస్ కి డోస్ -అరగంట రోజ్ అన్న నినాదాన్ని విద్యార్థుల్లో యువకుల్లో ఉద్యోగులు స్వచ్ఛంద సంస్థలు వివిధ వర్గాల ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.
క్రీడా కార్యక్రమాల్లో అందరూ పాల్గొనడం వల్ల సామాజిక బంధాలను బలపరుస్తాయని ఆయన అన్నారు.

క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, తెలంగాణ క్రీడా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ జాతీయ క్రీడా దినోత్సవం తొమ్మిది రోజులపాటు ఘనంగా నిర్వహించి దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడిందని అన్నారు.
పసి వయసు పిల్లలనుండి పండు ముసలి వరకు తెలంగాణ క్రీడా శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం హర్షనీయమని అన్నారు.

*స్పోర్ట్స్ పల్స్ ప్రారంభం*

తెలంగాణ క్రీడాకారులు సాధించిన విజయాలను, స్పోర్ట్స్ అథారిటీ కార్యక్రమాలను, సంక్షిప్తంగా సమాజానికి తెలియజేసి బావి క్రీడాకారులకు స్ఫూర్తి కలిగించే విధంగా రూపొందించిన నెలవారి సంచిక స్పోర్ట్స్ పల్స్
(క్రీడా నాడి)బులెటిన్ ను గౌరవనీయ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు ఆవిష్కరించారు.

*అనూహ్యస్పందన*

ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైక్లింగ్ లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ గారు జెండా ఊపి ప్రారంభించిన సైకిల్ ర్యాలీ గచ్చిబౌలి స్టేడియం మెయిన్ గేటు నుండి ప్రారంభమై త్రిబుల్ ఐటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్ పిస్తా హౌస్ ఐక్య షోరూం ఇనోరబిట్ నుండి కేబుల్ బ్రిడ్జి నుండి మాదాపూర్ వైపు అటు నుంచి భారతీయ విద్యా భవన్ టీ హబ్ డల్లాస్ సెంటర్ రోడ్డు నుండి బయో డైవర్సిటీ రోడ్డు మీదుగా గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంది.
ఇందులో పాల్గొన్న దాదాపు 1,000 మంది సైక్లిస్టులకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తరఫున సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సైకిలిస్టుల నుండి మంచి స్పందన లభించింది.
సీనియర్ సిటిజన్స్ తో పాటు విద్యార్థులు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. సోనీ బాలాదేవి
తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి ఐజీ (క్రీడలు ) రమేష్ డిసిపి వినీత్ గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్ కన్నం మధు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు సైక్లిస్ట్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.