వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి * రామన్నపేట ఎస్సై డి నాగరాజు

నకిరేకల్ నియోజకవర్గం/ అక్షర కలం (ప్రతినిధి)

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధి లోని వివిధ గ్రామాల ప్రజలను వరదల వచ్చే ప్రమాదాల నుండి అప్రమత్తంగా ఉండాలని రామన్నపేట ఎస్సై డి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గత కొద్దీ రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు, చేపలు పట్టడానికి వెళ్లి వలిగొండ లో ఒకరు, బొమ్మలరామారం లో ఒకరు , భువనగిరి రూరల్ ఏరియా ఇద్దరు మృతి చెందిన సంఘటనను చోటుచేసుకున్నాయని , ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రామన్నపేట పరిసర ప్రాంతాలలో ఉన్న వాగులు, చెరువులు, కుంటలు నిండి, వరద ఉదృతంగా ప్రవహిస్తున్నాయని మీ సమీపంలోని చెరువులు, కుంటలు, నీటి కాలువ వద్ద ఎవరైనా చేపలు పట్టడానికి, సెల్ఫీ ఫోటోలు దిగడానికి, గానీ ఈత కొట్టడానికి గాని వెళితే అటువంటి వారిని హెచ్చరించి అక్కడి నుండి పంపివేయాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు.

 


 

Leave A Reply

Your email address will not be published.