పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు

పునరావాస కేంద్రంలో ఉన్న వరద బాధితులు

లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు

* మంగపేట హైస్కూల్లో పునరావాస కేంద్రం

మంగపేట, ఆగస్టు 20 ( అక్షర కలం ) : మండలమైన మంగపేట సమీపంలోని పొదుమూరు కాలనీలో లోతట్టు ప్రాంతానికి చెందిన పలు కుటుంబాలను అధికారులు మంగపేట హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. గోదావరి నదికి ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద ప్రవాహంతో పొదుమూరు లోతట్టు ప్రాంతంలోని పలు ఇళ్ళకు ప్రమాదం పొంచి ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పునరావాస కేంద్రానికి తరలించి బుధవారం రాత్రి నుండి భోజన సౌకర్యం కల్పించారు. మంగపేట హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంగపేట తహసీల్దార్ తోట రవీందర్, ఎస్సై టీవీఆర్.సూరి, మండల ప్రత్యేక అధికారి సిద్ధార్థ రెడ్డి, ఎంపీడీవో బద్రు నాయక్, ఎంపీఓ శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా పొదుమూరు లోతట్టు ప్రాంతానికి చెందిన వరద బాధితులు గోదావరి వరదల వలన తాము పడుతున్న ఇబ్బందులను అధికారులకు వివరించారు. పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంగపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్ ఆధ్వర్యంలో తగిన చర్యలు చేపట్టారు. మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పునరావాస కేంద్రంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.

 

 

Leave A Reply

Your email address will not be published.