గత సంవత్సరం కంటే మెరుగ్గా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ….

– చివరి దశకు ధాన్యం కొను గోలు ప్రక్రియ….

– 415ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలలో కొనుగోలు పూర్తి….

– 90,669 రైతుల నుండి 4,01,033.440 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు….

– 73,429 మంది రైతులకు 786.06
కోట్ల రూపాయలు ఎకౌంట్లో జమ….

– వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా చూడాలి అవసరమైన వాహనాలు, టార్ఫాలిన్ లు అందుబాటులో ఉంచాము….

– జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్…..

మెదక్/ కొల్చారం జూన్ 13(అక్షర కలం):-

గతంలో కంటే మెరుగ్గా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై శనివారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ గతంలో కంటే మెరుగ్గా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాల సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 415 కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి ముగించడం జరిగిందన్నారు.చివరి దశకు ధాన్యం కొను గోలు ప్రక్రియ చేరుకుందని 90,669 రైతుల నుండి 4,01,033.440 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి73,429 మంది రైతులకు 786.06 కోట్ల రూపాయలు ఎకౌంట్లో జమ చేయడం జరిగింది అన్నారు.రవాణా, గోదాముల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మిల్లుల వద్ద త్వరగా దిగుమతి అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు.
ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.