నిశ్శబ్దాన్ని ఛేదించారు..!

 

–జిల్లాలో తగ్గుతున్న ఎయిడ్స్ బాధితుల సంఖ్య

—గత ఐదేళ్లలో గణనీయమైన ప్రగతి

—విస్తృతంగా అవగాహన కలిగివుండటమే కారణం

—నేడు ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం

— హెచ్ఐవి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం అంటున్న డిఎంహెచ్ఓ 

అక్షరకలం ప్రతినిధి, నల్గొండ

ఎయిడ్స్ అంటే ఎవరికి భయముండదు. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చాలు శరీరాన్ని వదిలివెళ్లదు. మందులు వాడితే నియంత్రణలో ఉంటుంది గానీ ఆదమరిస్తే మాత్రం తిరగబెట్టి కబళించేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరిగి క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసింది. ఫలితంగా నల్గొండ జిల్లాలో కొన్నేళ్లుగా ఎయిడ్స్ తగ్గుముఖం పడుతూ వస్తోంది. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం సందర్భంగా అక్షరకలం ప్రత్యేక కథనం.

ప్రపంచ ఎయిడ్స్ దినంగా మొదటి సారి 1988లో పాటించారు. అప్పటి నుంచి ఏటా డిసెంబర్ 1న ఈ దినాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినం హెచ్ఐవీ/ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించడం కోసం, ప్రపంచ వ్యాప్తంగా దీనిని ఎదుర్కొనేందుకు అందరినీ దగ్గర చేసే ఒక కార్యక్రమం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఈ వ్యాధితో పోరాడిన వారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ హెచ్ఐవీ పట్ల ప్రపంచం ప్రతి స్పందనగా సాధించిన ప్రగతిని జరుపుకునే కార్యక్రమాలకు, సంఘటనలకు ఈ రోజు అంకితం చేస్తారు. నల్గొండ జిల్లాలో 47 సమగ్ర సలహా, పరీక్షా కేంద్రాలు(ఐసీటీసీలు), 42 ఫెసిలిటీ ఇంటిగ్రేటెడ్ ఐసీటీసీలు, 3 సుఖవ్యాధుల చికిత్సా కేంద్రాలు, 3 లింక్ ఏఆర్టీ కేం ద్రాలు, రక్తనిధి కేంద్రాలు ( ప్రభుత్వ 1, ప్రైవేటు 6), 7 రక్తనిల్వ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం హెచ్ఐవీతో 7224 మంది జీవిస్తున్నారు.

న్యాకో హెచ్ఐవీ సెంటినెల్ సర్వైలెన్స్ సర్వే ప్రకారం జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే 0.47 శాతం తగ్గింది.

— తగ్గుతున్న హెచ్ఐవీ బాధితులు…

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ విభాగం నిర్వహిస్తున్న అవగాహన కార్య క్రమాలతో జిల్లాలో హెచ్ఐవీ బాధితుల తగ్గుతూ వస్తుంది. 2022 నుండి నేటి వరకు సాధారణ ప్రజలు 136853 మందికి పరీక్షలు చేయగా 1176 మందికి హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది.

గర్భిణుల్లో 57322 మందికి పరీక్షలు చేయగా 33 మందికి పాజిటివ్ వచ్చింది. గత మూడేళ్లలో ఏఆర్టీ కేంద్రాల్లో చికిత్స కోసం నమోదు చేసుకున్న వారి సంఖ్య 1209 కాగా అక్కడ మందులు వాడే వారి సంఖ్య 7224 మంది ఉన్నారు.

—ఇతర ప్రభుత్వ విభాగాల సహకారంతో………

మహిళా, శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, డిఆర్డిఏ, యూత్ క్లబ్స్, ఎన్జీవోలు తదితర శాఖల ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంగా 182 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అంతే కాకుండా రక్తదాన శిబిరాలు నిర్వహించి 7714 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రక్తం కొరత లేకుండా సురక్షిత రక్తమార్పిడి ద్వారా హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టేందుకు దోహదం చేశారు.

కాగా గతేడాది నల్గొండ జిల్లా కు ఉత్తమ ప్రతిభ అవార్డు వచ్చింది.

—హెచ్ఐవి రహిత జిల్లాగా మార్చడానికి కృషి….. 

డాక్టర్ పుట్ల శ్రీనివాస్ (జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నల్గొండ )

వరల్డ్ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని నల్గొండ జిల్లాకు గత ఏడాది 1 స్టేట్ ఆవార్డు వచ్చింది.

జిల్లాలో హెచ్ఐవి బాధితుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తుంది. వివిధ శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం. నల్లగొండ జిల్లాను హెచ్ఐవి రహిత జిల్లాగా మార్చడానికి కృషి చేస్తున్నాం.

Leave A Reply

Your email address will not be published.