నేడు రావణ దహన కాండ వేడుకలు…..

 

– రావణ దహనకాండ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి.

– మరికల్ యువక మండలి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి…..

మరికల్, అక్టోబర్ 02 (అక్షర కలం వెబ్ ):

మరికల్ మండల కేంద్రంలో దసరా పండగను పురస్కరించుకొని నిర్వహించే పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని మరికల్ యువకమండలి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి కోరారు. బుధవారం మరికల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా యువక మండలి ఆధ్వర్యంలో నిర్వహించే రావణ దహన కాండ కార్యక్రమం నారాయణపేట రోడ్డు బస్టాండ్ ఎదురుగా (సోమవారం) జరిగే సంత బజార్లు ఈ కార్యక్రమం నేడు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువకులు రవణాసురుని కటౌట్ ( చిత్రం ) నిర్మించుటకు బుధవారం ఉదయం నుండి సాయంత్రం దాకా అందరు కలిసి నిర్మాణాన్ని పూర్తి చేశారు. అదేవిధంగా
ఈ కార్యక్రమంలో ,ఆర్కెస్ట్రా, మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, బాణ సంచాలన కార్యక్రమం ఉంటుంది… అదేవిధంగా మరికల్ పట్టణంలో ప్రతి వార్డులో,167 జాతీయ రహదారిపై, ఇందిరమ్మ కూడలి లో కాషాయపు జెండాలతో అలంకరణ నిర్వహించడం జరిగింది .
ఇట్టి కార్యక్రమానికి మరికల్ మండలంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు, యువకులు మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో యువకమండలి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.