*జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు*

 

*జిల్లా ప్రజలకు, అధికారులకు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.*

నల్లగొండ ఆగస్టు 27 (అక్షర కలం )

వినాయక చవితి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాధునికి జిల్లా ఎస్పీ గారు పాల్గొని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వ‌హించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అధికారులకు,సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ,జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణం భక్తి శ్రద్ధలతో కులమతాలకు అతీతంగా సోదరభావం నిర్వహించుకోవాలనీ తెలిపారు. మండపాల వద్ద నిర్వాహకులు, యువత పోలీస్ వారి సూచనల పాటిస్తూ సహకరించాలని తెలిపారు.

ఈ పూజ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్,నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, 2 టౌన్ సీఐ రాఘవరావు, ట్రాఫిక్ సీఐ మహా లక్ష్మయ్య, ఆర్.ఐలు సంతోష్, సూరప్ప నాయుడు, శ్రీను, నరసింహ,హరిబాబు, యస్.ఐ సైదా బాబు, ఆర్.యస్.ఐలు కళ్యాణ్ రాజ్,రాజీవ్,అఖిల్, సాయి రామ్,శ్రావణి,మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.