- శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఆర్మూరు లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడులు
బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూరు పట్టణం ప్రాంతం లోని టీచర్స్ కాలనిలో గల శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో ఘనంగా 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ అడ్వకేట్ శ్రీధర్ కార్యక్రమ ము లో పాల్గొనడం జరిగినది. తను మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగినది.ప్రిన్సిపల్ వినోద్ కుమార్ మాట్లాడుతూ దేశ రక్షణలో మన అందరి బాధ్యత అని తెలుపుతూ,దేశానికి జవాన్,కిసాన్ లు వారి శక్తిని త్యాగాన్ని అర్పిస్తున్నారని వారి యొక్క గొప్ప తనాన్ని తెలియజేశారు.మంచి విద్యా భ్యాసం తో ముందుకు వెళ్లాలని,మన సంస్కృతి,సంప్రదాయాలను గౌరవిస్తూ ,పెద్దల పట్ల గౌరవంగా ఉండాలని ,సమాజం పట్ల అవగాహన ఉండాలని ,దేశ రక్షణలో ప్రతి ఒక్కరూ విధిగా తమ వంతు బాధ్యత తీసుకోవాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగినది .ప్రతి విజయం వెనుకాల ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయని ఒకసారి ఫెయిల్ ఐయినంత మాత్రాన అక్కడే వెనుకకు పోకుండా విజయం కోసం శ్రమించాలని తెలియజేశారు .మేనేజ్మెంట్ భాను తేజ మాట్లాడుతూ దేశం మనకు ఏమి ఇచ్చింది అని కాకుండా దేశానికి మనం ఏం ఇచ్చాం అని ఆలోచన చేయాలి అని,మంచి విద్యా అభ్యాసం తో మంచి ర్యాంకులు మార్కులు తెచ్చుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమము లో జిల్లా కార్యదర్శి రవి నాథ్,పాఠశాల ప్రభంధ కారిణి కమిటీ అధ్యక్షులు వంశీ కృష్ణ,ఉపాధ్యక్షులు జనార్ధన్ కిరణ్,కోశాధికారి రాజేష్ కమిటీ సభ్యులు రఘు, మెట్టు నితిన్,రాజేందర్ ,పాఠశాల ప్రిన్సిపాల్ వినోద్ కుమార్ ముద్రాకోల ,మేనేజ్మెంట్ భాను తేజ,అభిమన్యు,మాతాజీ లు సోనాలి,శైలజ ముద్రకోల,శ్రీ దివ్య ,సిందూజా,మంజుల,శైలజ ,లత,నిహారిక,ప్రియాంక ,వేద ,విద్యార్థిని విద్యార్థులు విధిగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమము లో పాల్గొన్నారు.