— మున్సిపల్ కార్మికుల ధర్నా
అక్షరకలం కోదాడ
సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ కార్యాలయం ముందు శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, నెలకు రూ.28 వేల వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ, కార్మికుల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.