ఆ అదృశ్య హస్తం ఎవరిది..?

  • పొద్దున ఫిర్యాదు… సాయంత్రం వాపస్ తీసుకున్న విఆర్ఎ లు
  • రెవెన్యూ … పోలిస్ అధికారుల ఫిర్యాదు వెనక్కి తగ్గడంలో పెద్ధల హస్తం
  • మంజీరా నది లో మళ్లి షూరు ఐనా ఇసుక తవ్వకాలు
  • ప్రజా ప్రతినిధి షాడో అనుచరుడి లీలలేనా?
    బతుకమ్మ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో మంజీరా నదిపై ఇసుక మాఫియా పడగ నీడలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఎందుకంటే అక్కడ ఇసుక మాఫియా వెనుక ఉన్న బినామీల నెట్ వర్క్ ధాటికి అక్కడ ఎవ్వరు తట్టుకోవడం లేదు. ప్రభుత్వ అదేశాల మేరకు ఇసుక తవ్వకాలకు బ్రేక్ పడిన ఇసుక మాఫియా మాత్రం రాత్రి పగలు తేడా లేకుండా ట్రాక్టర్ లలో ఇసుకను తవ్వడం డంప్ చేయడం దానిని టిప్పర్ లలో తరలించే పని చేపట్టింది. బిక్కుంద మండలం హస్గుల్, కత్ గాం, షెట్లూర్ ల ఇసుక రాత్రయిందంటే ఆక్రమంగా తరలిపోతుంది.ఇటీవల ప్రభుత్వ అదేశాల మేరకు కామారెడ్డి జిల్లా బిచ్కుంధ తాహసీల్ధార్ అక్కడ ఇసుక తవ్వకాలను అడ్డుకునేందుకు గ్రామాలలోని విఆర్ఎ లను పూరమాయించారు. వారికి రాత్రివేళల్లో ఇసుక మాఫియా బెదిరింపులు సర్వసాధరణ మయ్యాయి. వారికి గతంలో శాంతాపూర్ లో విఆర్ఎ కు ఏ గతి పట్టిందో మీకు అదేగతి పడుతుందని తమ వెనకు పెద్ధలు ఉన్నారని బె దిరింపులకు పాల్పడ్డారు. దానితో ఈ నెల 15న విఆర్ఏ లు తమకు ఇసుక అక్రమ రవాణ కట్టడి విధులు చేయలేమని చేతులేత్తేశారు. తమకు రక్షణ లేని డ్యూటి చేయలేమని తాహసీల్థార్ కు , బిచ్కుంధ సిఐకి ఫిర్యాదు చేశారు. వారు ఉదయం అధికారులకు ఇసుక మాఫి యా పై ఫిర్యాదు చేసి సాయంత్రం ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఈ అంశం అక్కడ అందరిని కలరవపాటుకు గురి చేస్తుంది.
    కామారెడ్డి జిల్లాలో మంజీరా నది లో గత ప్రభుత్వం హయాంలో బిచ్కుంధ, బిర్కూర్ పరివాహక ప్రాంతాలలో ఆక్రమ తవ్వకాలు జరిగాయని జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మి కాంత్ రావు గత నెలలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. స్పంధించిన ప్రభుత్వం విజిలెన్స్ తో విచారణ చేయించి అక్రమ తవ్వకాలు జరిగింది వాస్తవమేనని ఇసుక రిచ్ లలో తవ్వకాలను నిలుపుధల చేయించింది. దానితో రెండు మండలాల్లోని ఆరు ఇసుక రీచ్ లలో అక్రమ తవ్వకాలు నిలిచి పోయాయని అందరు సంబర పడ్డారు. కాని మంజీర ఇసుకపైనే ఆధారపడిన ఇసుక మాఫియా దందా నిర్వహణకు కొత్త దారి వెతికింది. గతంలో మాదిరిగా ప్రభుత్వం ఇసుక ను ప్రజల అవసరాల కోసం వారంకు రెండు రోజుల పాటు ఇసుకను ట్రాక్టర్ ల ద్వార తరలించే కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వానికి రాయల్టి కట్టామని చెబుతునే ట్రాక్టర్ లలో ఇసుకను వే బిల్లులు లేకుండానే తరలించడం దొరికితే దొంగ , దోరకక పోతే దొర అనే కోణంలో తవ్వకాలు చెపట్టారు. రెవిన్యూ, పోలిస్ అధికారులకు ట్రాక్టర్ లు దొరికిన, డంప్ లు దొరికిన వాటిని వేలంలలో కొ నడం అదే బిల్లులతో రెట్టింపు స్థాయిలో టిప్పర్ లలో తరలించే దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగించింది. ఐతే తహసీల్ధార్ ల ఆదేశాల మేరకు ఇసుక తవ్వాకాలను అడ్డుకునేందుకు నియమించబడిన విఆర్ఏల పై బెదిరింపులకు దిగింది లోకల్ ఇసుక మాఫియా. తమ వెనుక పెద్ధలు ఉన్నారని అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడితే రెవిన్యూ అధికారులకు తాము విధులు నిర్వహించలేమని కరఖండి గా తేల్చి చెప్పారు. పోలిస్ లను రక్షణ కోరితే మెన్ స్ర్టేంత్ లేదని వారు కుడా హ్యాండిచ్చారు. రెవిన్యూ అధికారికి, పోలిస్ ఇన్స్ పెక్టర్ కు ఫిర్యాదు చేశాం తమకు ఎలాంటి ఇబ్బందులు లేవనుకున్న విఆర్ఏ లపై ఇసుక మాఫియ పెద్ధ తలకాయాలను రంగంలోకి దించినట్లు తెలిసింది. దానితో పెద్ధ నెట్ వర్క్ కు తలొగ్గిన గ్రామ సేవకులు తోక ముడిచారు. ఉదయం ఫి ర్యాదు చేసిన చేతులతోనే తమ కంప్టైంట్ ను సాయంత్రం వెనక్కి తీసుకున్నారు. ఫి ర్యాదు చేసిన వారే తమ స్వహస్తాలతో వెనక్కి తీసుకోవడంతో అధికారుల చేష్టలుడిగి పోయాయి. విఆర్ఏ లు వెనక్కి తగ్గడం తో పోలిస్, రెవిన్యూ అధికారులు కుడా వెనక్కి తగ్గక తప్పలేదు. దానితోగతంలో మాధిరిగా ఇసుక తవ్వకాలు జోరందుకున్నాయి. గ్రామాలలో విస్థరించిన ఇసుక మాఫియా వెనుక ప్రజా ప్రతినిధి యొక్క అనుంగు అనుచరుడు ఉన్నట్టు తెలిసింది. ఇసుక మాఫియాకు పెద్ధ దిక్కుగా ప్రజా ప్రతినిధి కి షాడోగా చెలమణి అవుతున్న వ్యక్తి ఉన్నట్టు అంతా కోడై కూ స్తోంది. నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధికి ఓక దిక్కు ఇసుక మాఫీయా అగడాలని, దోపిడిని అరికట్టాలను మరో వైపు కొందరు ఇసుక మాఫియాకు మద్ధతు పలకడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.