- 3.61 లక్షల మొక్కలు నాటాలి
బతుకమ్మ, మోర్తాడ్ : అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా తయారైంది వన మహోత్సవం కార్యక్రమం. నర్సరీలో మొక్కలు ఉన్న, గుంతలు తీయడానికి, నాటడానికి కూలీలు ఉన్నారు. కానీ నిధులు లేక లక్ష్యం చేరడం లో ముందడుగు వేయలేక పోతుంది. పచ్చదనం పెంచడంతో పాటు పరిసరాలు ఆహ్లాదంగా ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం హరిత హారం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీని పేరును వన మహోత్సవంగా మార్చింది. వర్షాలు కురిసి న నేపథ్యంలో జిల్లాలో మొక్కలు నాటడం జూలై నెలలో ప్రారంభించారు. రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలతో పాటు, చెరువులు, కాలువ కట్టాలపైనా, ఖాళీ ప్రదేశాలల్లో పెద్ద ఎత్తున ఉద్యమంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశిస్తు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చని ప్రాంతాలుగా నిర్మించాలన్న లక్ష్యంతో 36 శాఖల సిబ్బంది ఉపాధి కూలీ లతో మొక్కలు నాటించారు. కానీ లక్ష్యం పూర్తి కాకుండానే మధ్యలో ఆగిపోయింది.
రెండేళ్లలో హరిత హారం ద్వారా నిజామాబాద్ జిల్లాలో
ప్లాంటేషన్ కింద
సంవత్సరం: లక్ష్యం
2022-23 : 18 లక్షలు
2023-24 : 16 లక్షలు
హోమ్ సీడ్ (ఇంటింటికి)
2022-23 : 12 లక్షలు
2023-24 : 10 లక్షలు
రెండు సంవత్సరాలల్లో 34 లక్షల మొక్కలు ప్లాంటేషన్ ద్వారా నాటినట్లు, అలాగే 22 లక్షల మొక్కలు హోమ్ సీడ్ రూపంలో పంపిణీ చేసినట్లు లెక్కలు చెబుతున్నారు.
… ఈ సంవత్సరం లక్ష్యం..
2024-25 లక్ష్యం 19.61 లక్షల మొక్కలు( ప్లాంటేషన్)
హోమ్ సీడ్ 5.5 లక్షలు.
వన మహోత్సవం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు 16 లక్షల మొక్కలు నాటినట్లు అధికారుల గాణంకాలు చెబుతున్నాయి. ఇంకా 3.61 లక్షల మొక్కలు నాట వలసి ఉంది ఆగస్టు చివరి వరకు లక్ష్యం పూర్తి చేయాలని ఉన్న లక్ష్యం పూర్తి కాకుండా మధ్యలో నిలిచిపోయింది.
నిబంధనల ప్రకారం ..
మొక్కలు నాటేందుకు కమ్యూనిటీ, ప్లాంటేషన్, హరిత వనంలో గుంత ను 0.45 సెంటీమీటర్ లోతు, వెడల్పు తవ్వాలి. రహదారుల వెంట రెండు ఫీట్లు గుంత తవ్వాలి. ఒక్క గుంత తవ్వినందుకు రూ. 27, మొక్క నాటినందుకు రూ. 12 కూలీ లకు చెల్లిస్తున్నారు. ఉపాధి హా మీ పని దినాలు పూర్తి కావడంతో కూలీలకు చెల్లించడానికి తగినంత డబ్బు లేకపోవడంతో నాటవలసిన 3.61 లక్షల మొక్కలు నాటకుండా అలాగే ఉండిపోయింది. దీంతో వన మహోత్సవం లక్ష్యం పూర్తి కాకుండా మధ్యలో నిలిచిపోయి. ఫలితంగా నర్సరీల్లో మొక్కల సంరక్షణ సక్రమంగా లేక నర్సరీలు దాటకుండానే మొక్కలు ఎండిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. నర్సరీలో మొక్కలు వృక్షాలుగా పెద్దవిగా పెరిగిపోయినాయి.
ఉన్నతాధికారుల దృష్టికి
సాయ గౌడ్, (జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి)
ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. అధికారుల నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటాం. హార్టికల్చర్ ను ప్రోత్సహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నాము.
