ఆపదలో ఉన్న వ్యక్తికి ఆర్థిక సహాయం

బతుకమ్మ, వేల్పూర్ :  హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ వేల్పూర్  ఆధ్వర్యంలో వేల్పూర్ గ్రామానికి చెందిన ఎరుకల ఎల్లయ్య కు సేవా సంస్థ ద్వారా 5000₹ ఆర్థిక సహాయం  అందజేశారు.  బాధిత వ్యక్తి గత కొద్ది సంవత్సరాల క్రితం పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి పని చేస్తున్న సమయంలో కాలు జారీ కింద పడటం వల్ల వెన్నుపూస కు  బలమైన గాయం అయింది. అప్పటినుండి  చికిత్స కోసం ఎక్కువ మొత్తం లో ఖర్చు చేసారు. నిరుపేద కుటుంబం కావడం వల్ల చేసేది లేక ధాత కోసం ఎదురు చూస్తూ ఉండగా  హెల్పింగ్ హాండ్ సేవా సంస్థ   బాధిత వ్యక్తి గురించి తెలుసుకొని తమకు తోచిన సహాయం అందించి అతనికి వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించడం జరిగింది.   ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ అధ్యక్షుడు వెన్న మురళి, ఉపాధ్యక్షుడు బాల సాయిలు కార్యదర్శి మోహన్ ట్రెజరర్ బాల్రాజ్ సభ్యులు రజనీకాంత్ గంగా ప్రవీణ్ సందీప్ జైపాల్ శ్రవణ్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.