అబ్కారి శాఖలో కాసులు ఇస్తేనే పని

  • ఇంచార్జీ అధికారుల పాలనలో రెచ్చి పోతున్న వసూళ్ల రాయుళ్లు
  • ప్రజా వాణి, ప్రజా దర్బర్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం
  • వసూళ్ల కోసమే హెడ్ కానిస్టెబుల్ నియామకం
  • అవినీతి అధికారిపై ఎసిబికి ఫిర్యాదు చేసిన సొసైటి సభ్యులు
  • ఎసిబికి ఫిర్యాదు చేయడంతో సెలవులో అధికారి
  • సొ సైటి ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆమరణ నిరాహరదీ క్షకు సిద్ధమైన సొసైటి సభ్యులు

బతుకమ్మ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో టిసిఎస్ -2 ఏర్పాటుకు ఆరు సంవత్సరాల క్రితం సొ సైటి సభ్యులు దరఖాస్తు చేశారు. కాని ఇఫ్పటి వరకు సొసైటి ఏర్పాటుకు నిజామాబాద్ జిల్లా అబ్కారి అధికారి అనుమతించలేదు.గత కొన్ని రోజులుగా 250 పై చిలుకు ఉన్న గీత కార్మీకులు కు రెండో సోసైటి కోసం ఎస్ హెచ్ ఓ మొదలుకొని జిల్లా సహకార అధికారి, అధనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్ ల సంతకాలను పూర్తి చేశారు. కాని జిల్లా అధికారి మాత్రం లైసెన్స్ జారీకి ససేమీరా అన్నారు. ఈ విషయంపై ప్రజా వాణిలో 6 సార్లు, రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రజా దర్బార్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. అగస్టు నెలలో సొసైటి బాధ్యులు జిల్లా కలెక్టర్ కు తమకు సొసైటి ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి లేదా ఆమరణ నిరాహర దిక్షకు అనుమతి ఇవ్వండి అని దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికి నెల రోజులు గడిచిన అనుమతి రాలేదు. ఇటివల కాలంలో బాధితులు ఎసిబిని ఆశ్రయించారు. దానితో అబ్కారి అధికారి సెలవులో వెళ్లారు. పక్షం రోజుల సెలువులు పొడిగించుకుంటున్నారు . కాని ఇప్పటికి ఎప్పుడు విధులలో చెరుతారో అధికారులు చెప్పడం లేదు….
నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ అవినితి పరులతో నిండిపోయింది. అక్కడ కాసులు ఇవ్వనిదే ఎలాంటి పని జరుగదు. కాసులు ఇస్తే అక్రమమైన సక్రమమే అని సర్టిఫికేట్ ఇచ్చే కల్చర్ ఉంది. ప్రధానంగా నిజామాబాద్ డివిజన్ పై అజమాయిషి చెలాయించే డిప్యూటి కమీషనర్ పోస్టు ఖాళీగా ఉంది. ఇంచార్జీ అధికారులకు అదనపు బాధ్యతలు ఉండటంతో ఇక్కడ అధికారుల అవిననీతి శ్రుతి మించింది. ప్రభుత్వానికి ఆదాయం పెంచే శాఖలలో ప్రధాన మైన అబ్కారి శాఖను అ అధికారి తన సొంత ఆదాయం పెంచుకునే శాఖగా మార్చేశారు. ఏకంగా వసూళ్ల కోసం జిల్లా అధికారి తన కార్యాలయంలో ఓ హెడ్ కానిస్టెబుల్ ను నియమించుకున్నారు. అతడి నిత్య పని సోసైటిలకు, కల్లు డిపోలకు, గీత కార్మీకులకు, మద్యం సిండికేట్ వ్యాపారులకు, బెల్ట్ షాపు నిర్వాహకులకు ఫోన్ లు చేసి సార్ కలువుమని సంకేతాలు ఇవ్వడం వారు ఇచ్చిన డబ్బులు జమ చేయడం. ప్రతి శనివారం రైలులో సార్ సొంత ఊరుకు వెళితే సుట్ కేసులో కాసులు పంపించడం వారం వారం జరిగే తంతుగా మారింది. ఎనాుడు యునిఫాం వేసుకోని సదరు హెడ్ కానిస్టెబుల్ ను చూసి సొంత అబ్కారీ శాఖాధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. సధరు అధికారి పేరు చెప్పి దాదాపుగా రెండు సంవత్సరాల కాలంలో బాగానే వెనుకేసుకున్నాడని అధికారి కావాలంటే అప్పటికప్పుడు రెండు మూడులక్షలు సర్ధుబాటు చేస్తాడని టాక్ ఉంది. జిల్లాలో ఏదైన కల్లు డిపో, సోసైటి, మద్యం దుకాణం, బెల్ట్ షాపుల గురించి మీడియాలో కథనాలు వస్తే అంతకంతకు రేటు పెంచి వసూళ్లు చేస్తారని చర్చ ఉంది. ఎంతగా మీడియాలో వస్తే అంతగా మామూళ్లు పెంచి ముక్కు పిండి వసూలు చేస్తారనేది బహిరంగ టాక్. తన చేతికి మట్టి అంటకుండా హెడ్ ను ముందు పెట్టి వసూలు చేస్తున్న సంగతి అందరికి సుపరిచితమే. బోధన్ రెండవ సొసైటి ఏర్పాటుకు ఇతరుల వద్ధ మాముళ్లు తీసుకుని తమకు లైసెన్స్ జారీ చేయడం లేదని వారు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు శాఖ పరమైన చర్యలు లేకపోవడం విశేషం. కనీసం శాఖ పరమైన విచారణ జరుగలేదంటే మాముళ్ల మత్తు అబ్కారి శాఖను ఎంతగా అవహించేందో చెప్పకనే చెబుతుంది.
జిల్లా అధికారి చేనులో మేస్తే తాము గట్టున మేస్తామా అన్న చందంగా ఉంది ఎస్ హెచ్ఓ ల పరిస్థితి. ప్రతి నెల ఆరు లక్షలకు పైగా మామూళ్లు వచ్చె పోలిస్ స్టేషన్ లకు లక్షలు పోసి పోస్టింగ్ తెచ్చుకున్నది ఉత్త డ్యూటి కోసమేనా తమకు సొంత లాభం చూసుకోవద్ధ అన్న చందంగా ఉంది పరిస్థితి. దానితో వారు మద్యం దుకాణా దారులు పురమాయిస్తేనే బెల్ట్ షాపులపై కేసులు, బైండోవర్ అదికుడా రికార్డుల కోసం నమోదు చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో కిరాణా దుకాణాలలో కల్లు ప్యాకేట్లు అమ్మకాలు జరుగుతున్న, చివరకు 31 మద్యం దుకాణాలు ఉన్నచోట బెల్ట్ షాపులు నిర్వహణ జరుగుతుంటే అధికారుల కళ్లకు కాసుల గంతలు కట్టారనే విమర్శలు ఉన్నాయి.ఆర్మూర్ లో ఇటీవల ఏర్పాటు చేసిన బార్ కు ఎలాంటి అనుమతులు లేవు కాని అది దర్జాగా సాగుతుంది.బార్ లలో లూజుగా మద్యం అమ్మకాలు చేయవద్ధని నిబంధనలు ఉల్లంఘించి వైన్స్ ల మాదిరిగా అమ్మకాలు నిజామాబాద్ నగరంలోని మూడు బార్ లలో కొనసాగుతుంది. ఇక నిజామాబాద్ జిల్లా క్రుత్రిమ కల్లు తయారికి పెట్టింది పేరు. వారు అక్కడ దానికి రైట్ సర్టిఫికేట్ ఇవ్వాలన్న, షాంపిల్ తియ్యాలన్న, తియ్యకుండా ఉండాలన్న కాసులు వసూలు చేస్తారనేది బహిరంగ రహస్యం, నిజామాబాద్ జిల్లాలో గంజాయి క్రయ విక్రయాలు జరుగుతున్న యువత మత్తు పదార్థాల బానిసలుగా మారుతున్న అబ్కారిశాఖ పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇక నిషేదిత అల్ర్పజోలం వినియోగం విచ్చల విడిగా సాగుతుంది. దానిని అనవాళ్లు ప్రతి కల్లుడిపోలు ఉంటాయి. అక్కడ వారికి అల్ర్పజోలం తో తయారి అయ్యే మత్తు కల్లు నిత్యం మామూళ్లు ఇచ్చే కల్పతరువుగా మారింది. ఎప్పుడో ఉమ్మడి రాష్ర్టంలో ఎక్సైజ్ సూపరింటేండేంట్ లు ఇద్ధరు ఎసిబికి చిక్కారు. కాని ప్రత్యేక రాష్ర్టం ఎర్పడిన తరువాత అవినితి నిరోధక శాఖకు జిల్లా బాస్ లు, ఎస్ హెచ్ఓలు చిక్కలేదు. అబ్కారిలో అవినితిపై ఎసిబి నజర్ వేయాల్సిన అవసరం ఉంది.

Leave A Reply

Your email address will not be published.