ఘనంగా ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమం


–నేటి నుండి ఇంటింటికీ ఆరోగ్య బృందాలు

— కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ చంద్రశేఖర్

— మిగిలిపోయిన పిల్లలను గుర్తించి చుక్కలు వేస్తామని వెల్లడి

ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం 

జిల్లాలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక మాన్యం చల్కలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుపర్నా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే. రాహుల్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పద్మలతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందేలా చూడాలని ఆరోగ్య శాఖ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ప్రయాణాల్లో ఉన్న పిల్లల కోసం బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 24 గంటల పాటు పనిచేసేలా మూడు రోజుల పాటు ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేశామని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

​మొదటి రోజు పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన పిల్లలను గుర్తించేందుకు సోమవారం నుండి ఆరోగ్య బృందాలు జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ తిరగనున్నాయని కలెక్టర్ తెలిపారు. ఇంటి వద్దనే మిగిలిపోయిన పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేస్తారని, అనంతరం ప్రతి ఇంటికీ మార్కింగ్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బూతులలో ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పద్మ తెలిపారు. మరోవైపు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర పరిశీలకురాలు, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుపర్నా, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కే. రాహుల్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పద్మ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ కే. నగేష్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, డాక్టర్ శంకర్, ఆరోగ్య విద్య విస్తరణాధికారి అంజయ్య గౌడ్‌లతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.