కోమల్ జనని హాస్పిటల్ లో అద్భుతం
సంగారెడ్డి ప్రతినిధి,అక్షరకలం..
సంగారెడ్డిలోని కోమల్ జనని హాస్పిటల్లో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించడం విశేషంగా నిలిచింది. జనని హాస్పిటల్ డాక్టర్ కోమల్ జీత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ముగ్గురు పిల్లలు సురక్షితంగా పుట్టడంలో ఆమె తీసుకున్న నిబద్ధత కు ప్రతి ఒక్కరూ ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్లను ధైర్యంగా నిర్వహించిన కోమల్జిత్ జైన్ పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రసవంలో ఇద్దరు ఆడ శిశువులు, ఒక మగ శిశువు జన్మించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తల్లి, ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో సంగారెడ్డి లో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టడం విశేషం అని చెప్పుకోవచ్చు.ఎన్నో ఏళ్లుగా తల్లి కావాలని ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు ఒకేసారి ముగ్గురు పిల్లలు పుట్టడం అదేవిధంగా జనని హాస్పిటల్ లో ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ కోమల్ జీత్ కి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందోత్సవాలు వెళ్లి విరిసాయి.ఈ సందర్భంగా వైద్య బృందానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.