రేపు ఇందూరుకు సినీ నటి ఎస్తేర్

బతుకమ్మ, నిజామాబాద్ :  సంగీత్ కల్చరల్ అకాడమీ వార్షికోత్సవం సెప్టెంబరు 1న నిజామాబాదు నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహిస్తున్నట్టు ఆ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆష్ట గంగాధర్ చెప్పారు.శనివారం అకాడమీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు వివిద రంగాల్లో ప్రతిభ చూపిన వారికి పురస్కారాలు ప్రధానం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మున్సిపల్ కమీషనర్ మంద మకరంద్, విద్యావేత్త వాణి గడ్డం,విశిష్ట అతిధులుగా ప్రముఖ సినీ నటి ఎస్తేర్ నరోన్హా , సినీ రచయిత కాసర్ల శ్యాం పాల్గొంటున్నారని వివరించారు.సాహితీప్రియులు పెద్దయెత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంగాధర్ విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో సంగీత్ కల్చరల్ అకాడమీ అద్యక్ష కార్యదర్శులు రవినాయక్,క్రాంతికుమార్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.