26..కస్ట్ గేట్లు ఎత్తిన ఎన్ఎస్పి అధికారులు…
నాగార్జునసాగర్, అక్షర కలం / ప్రతినిధి :
నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుండటంతో… నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ కు భారీగా ఇన్ ఫ్లో రావడంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది.. దీంతో గురువారం నాడు సాగర్ ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన ఎన్. ఎస్.పి.అధికారులు..
నాగార్జునసాగర్‌కు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో 26 గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగర్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.కృష్ణ బేసిన్‌లో అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా కనిపిస్తున్నాయ్.. ఆల్మట్టి, నారాయణ్‌పూర్ , జూరాల, తుంగభద్ర, శ్రీశైలం.. అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో అక్కడి నుంచి వరద నీరు మొత్తం ఇప్పుడు నాగార్జున సాగర్‌కి వచ్చి చేరుతోంది.ఈ సారి వర్షాలు బాగా కురవడం, ఎగువనుంచి వరదనీరు పోటెత్తడంతో, అటు శ్రీశైలం, ఇటు నాగార్జునసాగర్ నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. శుక్రవారం నాడు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల వద్ద విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్న నాగార్జునసాగర్ డ్యాం ప్రాజెక్ట్.
నాగార్జునసాగర్ సమాచారం…
పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 587.50 అడుగులవద్ద నీరు నిల్వవుంది.డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 305 టీఎంసీల నీరు నిల్వ ఉంది.జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 29,354 క్యూసెక్కుల నీటిని,కుడి కాలువ ద్వారా 1540 క్యూసెక్కుల నీటిని,ఎస్.ఎల్.బి.సి ద్వారా 2,400 క్యూసెక్కుల నీటిని, లోలేవల్ కెనాల్ ద్వారా నీటి విడుదల లేదు. నాగార్జునసాగర్ జలాశయానికి మొత్తం ఇన్ఫ్లో 1,72,774 క్యూసెక్కులు కాగా ,రిజర్వాయర్ నుండి మొత్తం 2,37,056 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు…