* వైరా ఎమ్మెల్యే, నేతలతో కలిసి ఆర్మీ జవాన్, పలు కుటుంబాలకు పరామర్శ.,…
అక్షర కలం/ కారేపల్లి:
*కారేపల్లి:* మండలంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బొర్రా రాజశేఖర్, జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ తదితరులతో కలిసి సూర్య తండాకు చెందిన ఆర్మీ జవాన్ బానోత్ అనిల్ నాయక్ జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల దుర్ఘటనలో మృతిచెందగా.. వారి నివాసానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని అభయమిచ్చారు
* దుబ్బతండా మాజీ సర్పంచ్ బానోత్ భద్రి భర్త అమర్ సింగ్ మరణించగా.. వారి నివాసానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యం చెప్పారు.
* కారేపల్లికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జడల వెంకటేశ్వరరావు హఠాన్మరణం చెందగా.. ఆయన మృతదేహం వద్ద నివాళిఅర్పించారు.
*మణియార్ నివాసానికి మర్యాదపూర్వకంగా..*
కారేపల్లికి చెందిన సీనియర్ నాయకులు.. సురేంద్ర మణియార్ నివాసానికి ఎంపీ రఘురాంరెడ్డి మర్యాదపూర్వకంగా వెళ్లి..మణీయార్ ను కలిశారు. తేనీటిని స్వీకరించి.. యోగక్షేమాలు తెలుసుకున్నారు.
*ఆయా కార్యక్రమాల్లో..:* మాజీ ఎంపీపీలు మంజుల, పద్మావతి, కాంగ్రెస్ మండలాధ్యక్షులు తలారి చంద్రశేఖర్, నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, బానోత్ రామ్మూర్తి, మల్లెల నాగేశ్వరరావు, దుగ్గినేని శ్రీనివాసరావు, హీరాలాల్, కురసం సత్యనారాయణ, టోనీ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.