– నానో యూరియా తో పర్యవరణ పరిరక్షణ
– పోషక విలువల సామర్ధ్యం ఎక్కువ
– నేలకు, పంట కు మేలు
– రైతుల్లో చైతన్యం రావాలి
– రైతులు నానో యూరియా వైపు మొగ్గు చూపాలి
– రైతులకు అవసరానికి తగ్గట్టుగా జిల్లాలో యూరియా సరఫరా- జిల్లా వ్యవసాయ అధికారి,సూర్యాపేట శ్రీధర్ రెడ్డి
సూర్యాపేట,ఆగస్టు,22 ( అక్షర కలం)
నానో యూరియా తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని నానో యూరియా పై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు.
శుక్రవారం ఆయన సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో రైతు బీరేల్లి రామచంద్ర రెడ్డి వ్యవసాయ క్షేత్రం లో నానొ యూరియా, నానో మందు ను డ్రోన్ ద్వారా పిచికారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ
నానో యూరియా వాడకం వల్ల దిగుబడిలో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని, అత్యంత ప్రయోజనకారిగా ఉన్న నానో యూరియాను రైతులు వాడే విధంగా చూడాలన్నారు.
నానో యూరియా అనేది నానోటెక్నాలజీ సహాయంతో తయారు చేయబడిన ద్రవ రూపంలో ఉండే ఎరువని, దీనిని వాడడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. నానో యూరియా మొక్కలకు సమర్థవంతంగా నత్రజనిని అందిస్తుందని , పంట దిగుబడిని పెంచడంలో సహాయపడుతుందన్నారు
సాంప్రదాయ యూరియా వాడటం వల్ల పర్యవరణ కాలుష్యం,
భూగర్భ జల వనరులకు ఇబ్బంది కలగడమే కాకుండా , నేలకు కూడా చాలా నష్టం కలుగుతుందన్నారు .
సాంప్రదాయ యూరియాతో పోలిస్తే నానో యూరియా తక్కువ మొత్తంలో వాడడం వల్ల,ఇది మట్టి, నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు
అధిక దిగుబడి తో పాటు, మెరుగైన పోషక విలువలతో కూడిన పంటలను పండించడానికి నానో యూరియా సహాయపడుతుందన్నారు.
నానో యూరియా ద్రవ రూపంలో ఉండటం వల్ల, రవాణా, నిల్వ చేయడం సులభతరమన్నారు
క్షేత్ర స్థాయిలో రైతుల తో సమావేశం ఏర్పరచి, నానో యూరియా వాడకం పైన విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు .
పంటలకు రసాయన ఎరువులు వేస్తేనే దిగుబడులు వస్తాయన్న ఆలోచనలో రైతులు ఉన్నారని,పంట ఆరోగ్యం, నాణ్యమైన ఉత్పత్తికి పచ్చిరొట్ట, సేంద్రియ, జీవన ఎరువులు ఎలా ఉపయోగపడతాయో నానో యూరియా కూడా అంతేనని అధికారులు రైతులకు వివరించాలన్నారు .
పంటలకు పోషకాలు అందించడంలో రసాయన ఎరువులకు ధీటుగా నానో ఎరువులు పనిచేస్తయన్నారు.
సంప్రదాయ యూరియా నత్రజని వాయువుగా మారి వాతావరణంలోకి విడుదలై పర్యావరణానికి హాని చేస్తుందని,రసాయన యూరియా అధికంగా వాడకం వల్ల పొటాష్, పాస్పరస్ లభ్యతను తగ్గిస్తుందని, నానో యూరియా స్ప్రే చేయడం తో పాటు పురుగు మందులు కూడా కలిపి పిచికారీ చేసుకోవచ్చని, తద్వారా ఖర్జు తగ్గుతుందని,నత్రజనిని వేగంగా విడుదల చేసే సంప్రదాయ యూరియా కంటే,నానో యూరియా వాడితే మంచిది అని తెలిపారు.
సారవంతమైన నేలను కాపాడుకోడానికి నానో ఎరువుల వాడకం మంచిదని,నానో సాంకేతికపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్,ఏఈవో సుష్మా,డ్రోన్ ఆపరేటర్ మధుసూదన్,రైతులు బీరేల్లి రామచంద్ర రెడ్డి, పాలకుర్తి శ్రీనివాస్ గౌడ్ ఆరాల సైదులు,వీరసోములు,గౌనీ లక్ష్మయ్య ,బోర్రాజు అవిలయ్య , ఉప్పల లక్ష్మయ్య,సందీప్ పాల్గొన్నారు.