జాతీయ రహదారి పునర్నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలి…

 

– జాతీయ రహదారిపై అప్పాజీపల్లి గ్రామస్తుల ధర్నా…

నర్సాపూర్ ,సెప్టెంబర్03( అక్షర కలం):-

జాతీయ రహదారి పునర్నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని బుధవారం మెదక్ – హైదరాబాద్, 765 డి జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టిన అప్పాజీపల్లి గ్రామ రైతులు. గతంలో బి ఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హాయంలో జాతీయ రహదారి పునర్నిర్మాణంలో భాగంగా అప్పాజీపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులకు సంబంధించి భూములు కోల్పోయారు వారికి అప్పటి శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి సుమారు 40 వరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయిస్తానని అలాగే పాత రోడ్డు స్థలాన్ని వాడుకోవచ్చునని హామీ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా మంగళవారం నాడు రెవెన్యూ అధికారులు పాత రోడ్డు స్థలంలో కడీలు వేయడంతో ఆగ్రహించిన రైతులు బుధవారం ఉదయం రాస్తారోకో చేపట్టారు దీంతో రోడ్డుకిరువైపులా భారీగా ట్రాఫిక్ జామైంది దీంతో స్థానిక ఎస్సై అహ్మద్ మోహినుద్దీన్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డిలు ఘటన స్థలానికి చేరుకొని కలెక్టర్ తో మాట్లాడుతామని హామీ ఇచ్చి రాస్తారోకో విరమింప చేశారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయానికి చేరుకొని మాకు న్యాయం చేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.