మంగపేట, సెప్టెంబర్ 03 ( అక్షర కలం ) :
ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ ( ఐపిఎస్ ) వార్షిక తనిఖీలలో భాగంగా బుధవారం మంగపేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్ పరిసరాలను, పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్ పనితీరును పరిశీలించారు. రిసెప్షన్ సిబ్బంది ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, ఫిర్యాదు అందిన వెంటనే విచారణ అధికారిని నియమించి విచారణ అనంతరం ఆలస్యం చేయకుండా కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 5 ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అని అడిగి, స్టేషన్ మొత్తం కలియతిరిగి పరిశీలించారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి, ప్రతి వర్టికల్ కు ఒక అధికారిని కేటాయించి ఎప్పటికప్పుడు రికార్డులు పెండింగ్ లేకుండా పని పూర్తి చేయాలని ఆదేశించారు. విచారణలో ఉన్న కేసులను పరిశీలించి ప్రతికేసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉండాలని సూచించారు. మిస్సింగ్ కేసుల చేదనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంప్యూటర్ సిబ్బంది పనితీరును పరిశీలించి ఎటువంటి పని పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు ఫైల్ లు ఆన్లైన్లో అప్డేట్ చేస్తూ ఉండాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలలో అవగాహన తీసుకురావాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, సిబ్బంది కూడా వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.
గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరయినా గంజాయికి, మాదక ద్రవ్యాలకు బానిస అయితే వారిని రిహాబిలిటేషన్ సెంటర్ కి తరలించి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు. సైబర్ మోసగాళ్ల బారిన పడి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గేమింగ్, బెట్టింగ్ అప్లికేషన్ లు వాటి ద్వారా జరిగే మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. వాటి బారిన పడి ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికీ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిoచాలి అని ఆదేశాలు జారీ చేశారు. యాక్సిడెంట్ తదితర కేసులలో స్వాధీన పరుచుకున్న వాహనాలను పరిశీలించి, అట్టి వాహనాలను వాహన యజమానులకు అందజేయాలని ఆదేశించారు.

సిబ్బoది ప్రతీ ఒక్కరిని విడివిడిగా వారు నిర్వహించే విధులను గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది వ్యక్తిగత సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ ( ఐపీఎస్ ), ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్ శంకర్, మంగపేట ఎస్సై టివిఆర్ సూరి, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.